రెండు అఫిడవిట్‌లలో వేర్వేరు వివరాలు ఇచ్చిన నటుడు విజయ్!
- పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ
- క్రిమినల్ కేసులు, ఎన్నికల బ్యాంకు ఖాతాలకు సంబందించిన వివరాల్లో తేడా
- న్యాయపరిశీలకు దారితీసే అవకాశం ఉందంటున్న నిపుణులు
పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానాల కోసం రూపొందించిన అఫిడవిట్‌లలో పెండింగ్ క్రిమినల్ కేసులు, ఎన్నికల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పెరంబూర్ ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్న విజయ్, తిరుచ్చి ఈస్ట్ కోసం సమర్పించిన అఫిడవిట్‌లో పెండింగ్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఒక బ్యాంకు ఖాతాను తెరిచామని, ఇందులో రూ.1 లక్ష ఉన్నట్లు పెరంబూర్ అఫిడవిట్లో పేర్కొన్న విజయ్, తిరుచ్చి అఫిడవిట్లో రెండు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు.