'రాకాస' మూవీ చూసిన వరుణ్ తేజ్ ఏమన్నారంటే..!
- నిర్మాతగా నిహారిక రెండో చిత్రం ‘రాకాస’ నేడు విడుదల
- ప్రీమియర్ షోల నుంచి సినిమాకు మంచి టాక్
- సినిమా చూసి ఎక్స్‌లో ప్రశంసలు కురిపించిన వరుణ్ తేజ్
- కామెడీ హైలైట్ అంటూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు
మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లవ్, కామెడీ, ఫాంటసీ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
'రాకాస' ఎంటర్‍టైనింగ్‍గా ఉంది.. సంగీత్ శోభన్ టాలెంట్ అద్భుతం: వరుణ్ తేజ్
తాజాగా ఈ సినిమాను వీక్షించిన నిహారిక సోదరుడు, హీరో వరుణ్ తేజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన రివ్యూ ఇచ్చారు. సినిమా ఎంతో వినోదాత్మకంగా ఉందని, ముఖ్యంగా కామెడీ అద్భుతంగా పండిందని ప్రశంసించారు. "‘రాకాస’ చూశాను, చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. కామెడీ ఈ సినిమాలో హైలైట్, నవ్వు ఆపుకోలేరు. సంగీత్ శోభన్ అద్భుతమైన టాలెంట్. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను అదరగొట్టేశారు. డైరెక్టర్ మానస శర్మ, నా స్టార్ ప్రొడ్యూసర్ నిహారికకు శుభాకాంక్షలు" అంటూ వరుణ్ తేజ్ పోస్ట్ చేశారు. వరుణ్ ప్రశంసతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.