ఇంటి పనులు చేయడం లేదని విడాకులా?.. భర్త పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం
- భార్య సేవకురాలు కాదన్న సుప్రీంకోర్టు
- సమాన గౌరవం పొందే భాగస్వామి అని స్పష్టీకరణ
- పనులను భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా పంచుకోవాలని సూచన
- విడాకుల కేసులో దంపతులకు మరో అవకాశం
- ఏప్రిల్ 27న హాజరుకు ఆదేశం
విచారణలో భాగంగా "మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనలు మారాలి. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులను భార్య ఒక్కరే చేయాలన్న అంచనాలు ఈ కాలానికి సరిపోవు. మీరు పెళ్లి చేసుకున్నది సేవకురాలిని కాదు, జీవిత భాగస్వామిని. ఇంటి పనులను ఇద్దరూ సమానంగా పంచుకోవాలి" అని ధర్మాసనం హితవు పలికింది.
ఈ కేసులో భర్త ఉపాధ్యాయుడు కాగా, భార్య లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. విద్యావంతులైన వారు ఇలాంటి చిన్న కారణాలతో విడిపోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, బిడ్డ భవిష్యత్తు కోసం గతాన్ని మరిచి కలిసి ఉండాలని సూచించింది.
ఇప్పటికే ఒకసారి వీరి మధ్య మధ్యవర్తిత్వం విఫలమైనప్పటికీ, బంధాన్ని నిలబెట్టేందుకు మరో ప్రయత్నంగా ఏప్రిల్ 27న తమ ముందు హాజరుకావాలని దంపతులను ఆదేశించింది.