తెలంగాణ బడ్జెట్ను స్వాగతించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
- రైతులు, సంక్షేమం, సమగ్ర అభివృద్ధిపై ఈ బడ్జెట్లో దృష్టి సారించారని వెల్లడి
- మైనారిటీల సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించడం పట్ల హర్షం
- గత సంవత్సరం కంటే రూ.178 కోట్లు అధికంగా కేటాయించారని ప్రశంస
మైనారిటీ మహిళలకు 10,000 కుట్టు మిషన్ల పంపిణీ, 4,655 మంది మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలు ఆర్థిక స్వావలంభనకు తోడ్పడుతాయని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల ఉపాధి అవకాశాలను ఇవి మెరుగుపరుస్తాయని ఆయన తెలిపారు. ఈ బడ్జెట్లో మైనారిటీల విద్య, వ్యాపారాల అభివృద్ధి, ఆర్థిక స్వావలంభనకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.