'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ సెటైర్
- రణ్వీర్ సింగ్ 'ధురంధర్ 2'పై దక్షిణాది హీరోల ప్రశంసలు
- సినిమాను పొగిడిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ
- స్టార్ హీరోల పొగడ్తలపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్య
- ఇవి నిజమైన ప్రశంసలా లేక 'బాధ్యతలా' అని ప్రశ్న
- సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన ప్రకాశ్ రాజ్ కామెంట్
వివరాల్లోకి వెళితే... రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి పలువురు దక్షిణాది అగ్ర తారలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.
ఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్.. "నలుగురు పెద్ద సౌత్ స్టార్లు 'ధురంధర్'ను పొగిడారు. ఒక్క బాలీవుడ్ సెలబ్రిటీ అయినా ఈ సినిమా గురించి మాట్లాడారా?" అని ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. "ఈ 'బాధ్యతల' సంకేతాలు దక్షిణాదికి కూడా పాకుతున్నాయి.. #జస్ట్ఆస్కింగ్" అని కామెంట్ చేశారు.