స్పీకర్ జడ్జిమెంట్‌ను ప్రశ్నించిన కేటీఆర్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సభాపతి జడ్జిమెంట్‌ను కేటీఆర్ ప్రశ్నించడం సరికాదన్న మంత్రి
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్న
- బీఆర్ఎస్ వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిందన్న మంత్రి
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సభాపతి జడ్జిమెంట్‌ను కేటీఆర్ ప్రశ్నించడం సరికాదని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేసే బీఆర్ఎస్ పార్టీ వరుసగా నాలుగు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని నిలదీశారు. అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారని అన్నారు. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నాయకులు అని మంత్రి అన్నారు.