తొర్రూరులో ఉద్రిక్తత... ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై దాడి
- తొర్రూరులో బీఆర్ఎస్కు 9, కాంగ్రెస్కు 7 స్థానాలు
- ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకున్న కడియం కావ్య
- కావ్య వరంగల్లో కూడా నమోదు చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపణ
- ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, ఎర్రబెల్లి పీఏపై దాడి
కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఎక్స్అఫీషియోలుగా పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. డ్రా ద్వారా ఎన్నికను నిర్వహించే అవకాశముంది.
అయితే కడియం కావ్య ఇదివరకే వరంగల్లో ఎక్స్అఫీషియోగా నమోదు చేసుకున్నారని, ఇప్పుడు మళ్లీ తొర్రూరులో ఎలా చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. వారిమధ్య తోపులాట జరిగింది.
ఆ సమయంలో అక్కడకు కడియం కావ్య, యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి పీఏపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కడియం కావ్య రెండుచోట్ల ఎక్స్ అఫీషియోగా నమోదు చేయించుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.