రేవంత్ రెడ్డిని కలిసి తన పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ
- ఈ నెల 26న విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం
- ఉదయ్ పూర్ లోని ప్యాలస్ లో పెళ్లి వేడుక
- రేవంత్ రెడ్డికి పెళ్లి పత్రిక అందించిన విజయ్ దేవరకొండ
పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో... విజయ్ దేవరకొండ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజయ్ కలిశాడు. హైదరాబాద్ లోని రేవంత్ నివాసానికి వెళ్లి స్వయంగా పెళ్లి పత్రికను అందించాడు. తన పెళ్లికి రావాలని ఆహ్వానించాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ముఖ్యమంత్రి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.