మండలిని శాసించాలని బొత్స ప్రయత్నించడం హాస్యాస్పదం: మంత్రి అచ్చెన్నాయుడు
- వైసీపీ నేతలపై అచ్చెన్నాయుడు ఫైర్
- పరిశ్రమల ఏర్పాటుపై ద్వంద్వ వైఖరి అంటూ విమర్శలు
- భూములే ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్న
పరిశ్రమలకు భూములే ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్ గణాంకాలతో సహా సమాధానం ఇస్తుంటే, వినే ఓపిక లేక వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మన దేశానికి వస్తున్న ప్రతి వంద రూపాయల పెట్టుబడిలో 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని, ఇదే తమ కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమల స్థాపన అత్యవసరమని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే, భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన వైసీపీ నేతలను హెచ్చరించారు.