టీ20 ప్రపంచకప్: టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆసుపత్రిలో ఓపెనర్ అభిషేక్ శర్మ
- పొట్టలో ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ
- నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం
- పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ దృష్ట్యా విశ్రాంతినిచ్చే యోచనలో మేనేజ్మెంట్
- అభిషేక్ స్థానంలో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌కు దక్కనున్న ఛాన్స్
యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తీవ్ర జ్వరంతోనే బరిలోకి దిగి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. త్వరలో పాకిస్థాన్ (ఫిబ్రవరి 15), నెదర్లాండ్స్ (ఫిబ్రవరి 18) జట్లతో కీలక మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో, అభిషేక్ విషయంలో యాజమాన్యం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అభిషేక్ గైర్హాజరీతో సంజూ శాంసన్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కవచ్చు. మంగళవారం జరిగిన ప్రాక్టీస్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం కనిపించింది. బుధవారం సాయంత్రం జరిగే చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత తుది జట్టుపై స్పష్టత రానుంది.