దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం
- ఆయన అత్తగారు పద్మావతి కన్నుమూత
- సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేసిన దర్శకుడు
- తల్లి, అత్తగారు ఒకే తేదీన మరణించడంపై ఆవేదన
"ఇన్నాళ్లూ మా అమ్మని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ పద్మావతి శివైక్యం చెందారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
తన తల్లి మరణించిన తేదీనే అత్తగారు కూడా కన్నుమూయడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 ఫిబ్రవరి 7న పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు చెప్పాల్సి రావడం మా కుటుంబానికి తీరని లోటు" అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.