ఒక్కరోజులో రూ.72 వేలు తగ్గిన వెండి, 2 శాతం క్షీణించిన బంగారం
- లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- ఢిల్లీలో 19 శాతం తగ్గి రూ.3.12 లక్షలకు పడిపోయిన వెండి
- రూ.1.65 లక్షలకు పడిపోయిన బంగారం ధర
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వెండి ధర కిలో 18.85 శాతం లేదా రూ.72,500 క్షీణించి రూ.3,12,000 పలికింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటేలా పెరుగుతున్న వెండి ధరలు వరుసగా రెండు రోజులు భారీ నష్టాన్ని చూశాయి. గురువారం కిలో వెండి ధర రూ.4 లక్షలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 11 శాతం పడిపోయాయి. కామెక్స్‌లో వెండి ధర 31 శాతం క్షీణించింది.