చిరంజీవికి నచ్చిన హీరో ఎవరో వెల్లడించిన దర్శకుడు బాబీ
- నవీన్ పొలిశెట్టి తనకు నచ్చిన హీరో అని చిరంజీవి చెప్పారన్న బాబీ
- ఆ మాట విని ఎంతో ఆనందానికి గురైన నవీన్
- నవీన్ మంచి టైమింగ్ ఉన్న నటుడు అంటూ బాబీ కితాబు
తనతో చిరంజీవి మాట్లాడుతూ... నవీన్ పొలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా బాగుందటగా అని అడిగారని బాబీ తెలిపారు. ఈ తరం నటుల్లో తనకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి అని చిరంజీవి చెప్పారని వెల్లడించారు. ఈ మాటలు చెప్పగానే ఆడిటోరియంలో ఉత్సాహం వెల్లివిరిసింది. అక్కడే ఉన్న నవీన్ ఈ మాట విని ఎంతో ఆనందానికి గురయ్యాడు. ఈ సినిమా కోసం నవీన్ ఎంతో కష్టపడ్డాడని బాబీ ప్రశంసించారు. ఆ కష్టం ఫలితమే ఈరోజు ఆయనకు వచ్చిన సక్సెస్ అని చెప్పారు. నవీన్ మంచి టైమింగ్ ఉన్న నటుడు అని కితాబునిచ్చారు.