అండర్-19 వరల్డ్ కప్... భారీ తేడాతో జింబాబ్వేను ఓడించిన భారత్
- 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే
- 148 పరుగులకే ఆలౌట్ చేసిన భారత బౌలర్లు
- 204 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం
- విహాన్ మల్హోత్రా శతకం (109).. అభిజ్ఞాన్ (61), సూర్యవంశీ (52) హాఫ్ సెంచరీలు
మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. విహాన్ మల్హోత్రా (109) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, అభిజ్ఞాన్ (61), వైభవ్ సూర్యవంశీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆరోన్ జార్జ్ (23), ఆయుష్ మాత్రే (21), అంబ్రిష్ (21), వేదాంత్ త్రివేది (15) పరుగులు చేశారు. చివర్లో ఖిలాన్ పటేల్ (30) దూకుడుగా ఆడటంతో భారత్ 350 మార్క్‌ను దాటి 352 పరుగులు చేసింది.
జింబాబ్వే బౌలర్లలో చిముగోరో 3, పనాషే మజై 2, సింబరాషే 2, ధ్రువ్ పటేల్ ఒక వికెట్ తీశారు. అనంతరం 353 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గ్రూప్-2లో ఆరు విజయాలతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో, మూడో స్థానాల్లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఉన్నాయి.