సాక్షిపై పరువునష్టం దావా.. విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేశ్
- విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్
- 2019లో ప్రచురితమైన కథనంపై ఈ కేసు వేసిన లోకేశ్
- 'చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి' అనే శీర్షికపై దావా
2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇది పూర్తిగా అవాస్తవమని ఆరోపిస్తూ లోకేశ్ ఈ కేసు దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో రెండుసార్లు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా, నేడు మూడోసారి ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు.