న్యూ ఇయర్ వేళ, మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు
- నిన్న రాత్రి నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
- నాంపల్లి పోలీసులకు విచిత్ర అనుభవం
- తన బైక్ తనకు ఇవ్వాలంటూ తలకు గోడకేసి బాదుకున్న యువకుడు
- పోలీసు అధికారి ఎంతగా సర్ది చెప్పినా ఏడుస్తూ ముప్పుతిప్పలు పెట్టిన యువకుడు
తన బైక్ తనకు ఇప్పించాలని తలను గోడకేసి బాదుకున్నాడు. బైక్ తాళం చెవి ఇవ్వాలని, లేకపోతే తనకు కోపం వస్తోందని పోలీసులతో అన్నాడు. ఒక పోలీసు అధికారి కాళ్లపై పడ్డాడు. మీ తండ్రి పేరేమిటని అడిగితే, బైక్ సీటుపై చేయితో గట్టిగా కొడుతూ సమాధానం దాటవేశాడు. ట్రాఫిక్ పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఏడుస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టాడు.