చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చెవిరెడ్డి... ఆసుపత్రికి తరలింపు
- లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న చెవిరెడ్డి
- జైల్లో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వైనం
- చర్మ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన జైలు అధికారులు
దీంతో, ఈ విషయాన్ని జైలు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు చెవిరెడ్డిని జైలు సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. ప్రస్తుతం చెవిరెడ్డి ఆరోగ్యం బాగుందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు, గత నెల కూడా వైద్య పరీక్షల నిమిత్తం చెవిరెడ్డిని ఆసుపత్రికి తీసకెళ్లారు. వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.