బాలా మామయ్య నట తాండవం చూడబోతున్నాం: మంత్రి నారా లోకేశ్
- రేపు అఖండ-2 రిలీజ్
- సోషల్ మీడియాలో స్పందించిన మంత్రి నారా లోకేశ్
- సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయం సాధించాలని ఆకాంక్ష
- ఐదు దశాబ్దాల చరిత్రలో మరో ఘనవిజయమన్న లోకేశ్
- చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్
"'అఖండ 2' సినిమాలో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. గాడ్ ఆఫ్ మాసెస్ మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
"ఐదు దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న బాలా మామయ్యకు అభినందనలు" అంటూ బాలకృష్ణను కొనియాడారు. లోకేశ్ తన పోస్టులో '#Akhanda2Thaandavam', '#Akhanda2' అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించారు. బాలకృష్ణ హీరోగా గతంలో వచ్చిన 'అఖండ' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.