కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
- జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తో పాటు మరో ముగ్గురు సస్పెన్షన్
- ఉత్తర్వులు జారీ చేసిన జైళ్ల శాఖ డీజీ
- ఖైదీలకు సెల్ ఫోన్లు అందిస్తున్నారన్న ఆరోపణలతో విచారణ జరిపిన డీఐజీ
జైలులో ఖైదీలకు సెల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు మొబైల్ ఫోన్లు అందిస్తున్నారన్న అభియోగాలపై గత నాలుగు రోజులుగా జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.