పొరుగింటి వ్యక్తిపై దాడిచేసిన టీమిండియా క్రికెటర్ షమీ భార్య.. వీడియో ఇదిగో!
- పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలో ఘటన
- తన కుమార్తె పేరిట ఉన్న భూమిలో నిర్మాణమే వివాదానికి కారణం
- ఆ భూమి వివాదంలో ఉండటంతో అడ్డుకున్న పొరుగు వారు
- పరస్పరం కేసు పెట్టుకున్న జహాన్, దలియా ఖాతూన్
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని సూరి పట్టణంలో ఒక భూమి విషయంలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కుమార్తె అర్షి పేరిట ఉన్న భూమిలో హసీన్ జహాన్ నిర్మాణ పనులు ప్రారంభించడమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. ఇదే విషయమై హసీన్ జహాన్ గతంలో ఆమె పొరుగు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భూమి వివాదంలో ఉందన్న కారణంతోనే పొరుగువారు అడ్డుకుంటున్నట్టు తెలిసింది. హసీన్ కూడా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కేసుకు ప్రతిగా స్థానిక తృణమూల్ నేత, కౌన్సిలర్ భర్త కాజీ ఫర్జుద్దీన్పై హసీన్ జహాన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.