పోలీస్ విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి
--
తోపుదుర్తి మాటలతో రెచ్చిపోయిన కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెచ్చగొట్టాడని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వివరించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు పంపించారు. తాజాగా సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్లో పోలీసుల విచారణకు హాజరయ్యారు.