ఓటీటీలోకి నిహారిక కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
--
సంక్రాంతి కానుకగా విడుదలైన మద్రాస్ కారన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా, ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. మద్రాస్ కారన్ తమిళ్ వెర్షన్ ను ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆహా అధికారికంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.