ఏపీ డిప్యూటీ సీఎంతో దిల్ రాజు భేటీ
- మంగళగిరిలోని జనసేన ఆఫీసులో సమావేశం
- గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై చర్చ
- ముఖ్య అతిథిగా రావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం
దిల్ రాజు, పవన్ ల భేటీపై గేమ్ ఛేంజర్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు, ప్రచార చిత్రాలు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన రామ్ చరణ్ భారీ కటౌట్ రికార్డులకెక్కింది.