సినిమా వారిని భయపెట్టి మంచి చేసుకోవాలనుకోవద్దు: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం
- శ్రీతేజ్‌ను పరామర్శించిన హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు
- శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు మనోధైర్యం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారని హరీశ్ వెల్లడి
- సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శ
అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ... శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కిమ్స్ డాక్టర్లు చెప్పారన్నారు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు చెప్పారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు మనోధైర్యం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని వివరించారు. రేవతి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శించారు.
గురుకులాలు, హాస్టళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలను సీఎం ఎందుకు పరామర్శించడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు కారణమైన తన సోదరుడిని సీఎం ఎందుకు అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమేనని సీఎం చెబుతున్నారని, మరి తన సోదరుడిపై చర్యలు ఏవి? అని ప్రశ్నించారు.