ముంబయి మెట్రో రైలుపై 'పుష్ప'... వీడియో ఇదిగో!
- అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప-2 ది రూల్
- సుకుమార్ దర్శకత్వంలో హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్
- డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్
సినిమా రిలీజ్ కు మరి కొన్ని రోజుల సమయమే ఉండడంతో, చిత్రబృందం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో సినిమా ప్రమోషన్ చేపట్టింది. ఈ క్రమంలో, ముంబయి మెట్రో రైళ్ల పైనా పుష్ప-2 చిత్రాన్ని బ్రాండింగ్ చేస్తున్నారు. ముంబయి మెట్రో రైళ్లలో ప్రతి కంపార్ట్ మెంట్ పైనా పుష్ప-2 చిత్రం పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకుంది.