ఇండిగోపై శృతిహాసన్ ఫైర్... స్పందించిన ఎయిర్‌లైన్స్
- తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంటల పాటు ఆలస్యం
- ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఎక్స్ వేదికగా శృతిహాసన్ అసహనం
- ప్రయాణికులకు సేవలు అందించడంలో ఎయిర్‌లైన్స్ దిగజారుతోందని ట్వీట్
తనతోపాటు పలువురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తూ 4 గంటల పాటు ఉండిపోయామని శృతిహాసన్ తెలిపారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానం ఆలస్యం విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ఇకనైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా విమానయాన సంస్థ తన సర్వీసులను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు.
ఇక శృతిహాసన్ ట్వీట్‌పై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని తెలిపింది. ఈ విషయాన్ని శృతిహాసన్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఇండిగో పేర్కొంది.
అయితే, ఇండిగో సమాధానాన్ని పలువురు నెటిజన్లు విమర్శించారు. ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని దుయ్యబట్టారు. ఉన్న విషయం చెబితే ప్రయాణికులు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.