రజనీకాంత్ లేటెస్ట్ మూవీపై భారీ అంచనాలు.. లిరికల్ సాంగ్ రిలీజ్
- రజనీ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'వేట్టైయాన్'
- అక్టోబర్ 10న పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న చిత్రం
- కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి
‘వేట్టైయాన్ - ది హంటర్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. టి.జె. జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంటర్’.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
తెలుగు రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.