ఆడియన్స్ అభిప్రాయాలకు స్పందన.. తగ్గిన ‘భారతీయుడు 2’ మూవీ నిడివి
- కమల హాసన్-శంకర్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు 2’ మూవీ
- మూడు గంటల నిడివిపై ప్రేక్షకుల అసహనం
- 20 నిమిషాల సీన్లు కట్ చేసిన చిత్ర బృందం
- 2.40 గంటల నిడివితో నిన్నటి నుంచే అందుబాటులోకి
ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా మేకింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ మరీ మూడు గంటల నిడివి ఉందంటూ సోషల్ మీడియాలో ఆడియన్స్ తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడియన్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న చిత్రబృందం దాదాపు 20 నిమిషాల నిడివిగల దృశ్యాలను తొలగించింది. దీంతో సినిమా నిడివి 2.40 గంటలకు తగ్గింది. ఇదే నిడివితో నిన్న సాయంత్రం నుంచే థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.