తెలంగాణ చిహ్నంలో చార్మినార్ను తొలగించే ధైర్యం ఉందా?: బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి
- రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడి
- రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండాల్సిందేనని స్పష్టీకరణ
- బలిదేవతకు రేవంత్ రెడ్డి భక్తుడిగా మారిపోయారని ఎద్దేవా
- బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలన్న మహేశ్వర్ రెడ్డి
రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు రూ.25 వేలు ఇస్తామని చెప్పారని... ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు. బలిదేవతకు రేవంత్ రెడ్డి భక్తుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదన్నారు.