దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్ కుమార్తె
- 'గాంధీతాత చెట్టు' సినిమాలో నటించిన సుకృతి
- దాదా సాహెబ్ ఫాల్కే ఉత్తమ బాలనటి అవార్డును కైవసం చేసుకున్న సుకృతి
- 8వ తరగతి చదువుతున్న సుకుమార్ కూతురు
ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో సుకృతి 8వ తరగతి చదువుతోంది. సుకృతి నటించిన ఈ చిత్రం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. ఈ చిత్రానికి పలు అవార్డులు వచ్చాయి. ఉత్తమ తొలి సినిమా బాలనటిగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను సుకృతి గెలుచుకుంది.