వోడ్కా తాగుతున్న రామ్ గోపాల్ వర్మతో సురేఖావాణి కూతురు
- సోషల్ మీడియా ద్వారా పాప్యులర్ అయిన సుప్రీత
- ఇటీవలే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ
- అమర్ దీప్ చౌదరి, సుప్రీత జంటగా తెరకెక్కుతున్న సినిమా
తాజాగా సుప్రీత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సుప్రీత జంటగా ఒక సినిమా ప్రారంభమయింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా మరోసారి సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సుప్రీత కలిసి ఉన్న ఫొటో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో రామ్ గోపాల్ వర్మ వోడ్కా తాగుతుండగా... ఆయన పక్కనే సుప్రీత కూర్చొని ఉంది. మరి తన నెక్స్ట్ మూవీలో సుప్రీతకు వర్మ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.
మరోవైపు, తన తల్లి సురేఖ గురించి ఇటీవల సుప్రీత కీలక వ్యాఖ్యలు చేసింది. సురేఖ భర్త చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె తన కూతురే లోకంగా జీవిస్తోంది. దీనిపై సుప్రీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన తల్లికి రెండో పెళ్లి చేస్తానని చెప్పింది. అమ్మను బాగా చూసుకునే వ్యక్తి దొరికితే సెకండ్ మ్యారేజ్ చేస్తానని తెలిపింది. సంబంధాలు కూడా చూస్తున్నానని చెప్పింది.