వైఎస్సార్, కేసీఆర్ ల ఆఫర్లను తిరస్కరించాను.. నాకు పదవులు ముఖ్యం కాదు: రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ 80కి పైగా సీట్లను గెలుచుకుంటుందన్న రేవంత్
- సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని వ్యాఖ్య
- పదవుల మీద ఆశ లేదు కాబట్టే 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నానన్న రేవంత్
తాను ఎప్పుడూ పదవులు ఆశించలేదని... అధికారం కావాలని ఆశిస్తే తాను అధికార పక్ష పార్టీల్లో కీలక పదవుల్లో ఉండేవాడినని రేవంత్ చెప్పారు. పదవులు ఆశించలేదు కాబట్టే... పీసీపీ చీఫ్ గా ఉన్నానని, 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నానని తెలిపారు. గతంలో తనకు వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ లు ఆఫర్లు ఇచ్చారని... కానీ, వాటిని తాను తిరస్కరించానని చెప్పారు. తనకు ప్రజాసేవ చేయడమే ముఖ్యమని అన్నారు. ఇండిపెండెంట్ గా తాను జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచానని... రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందానని చెప్పారు.