చంద్రబాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలి: బొత్స సత్యనారాయణ
- చంద్రబాబు విడుదలపై మంత్రి బొత్స స్పందన
- కంట్లో, ఒంట్లో బాలేదంటూ బెయిల్ పొందారని వెల్లడి
- చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్య
- లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ
డబ్బులు ఇస్తే ప్రజలు ఓటేస్తారని అనుకోవవడం పొరపాటని, ప్రజలు చాలా తెలివైన వాళ్లని బొత్స వ్యాఖ్యానించారు. కేసు కొట్టేస్తే సంతోషించొచ్చు కానీ లేనివి ఉన్నట్టు చెప్పే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక న్యాయం గురించి ప్రజలకు తెలియజెప్పాలన్నారు. మంత్రి పదవుల సహా అన్నింటా సామాజిక న్యాయం అందిస్తున్నామని తెలిపారు. గతంలో జన్మభూమి కమిటీలలా కాకుండా అవినీతి లేకుండా కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని మంత్రి ప్రకటించారు.