నితిన్ 'ఎక్స్ ట్రా' ఆర్డినరీ మ్యాన్... టీజర్ ఇదిగో!
- నితిన్, శ్రీలీల జంటగా 'ఎక్స్ ట్రా...'
- వక్కంతం వంశీ దర్శకత్వం
- సోషల్ మీడియాలో టీజర్ ను పంచుకున్న నితిన్
- డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఎక్స్ ట్రా...'
ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, అన్నపూర్ణమ్మ, పవిత్ర, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇవాళ విడుదలైన టీజర్ చూస్తే వినోదానికి లోటు లేదనిపిస్తోంది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.