రాష్ట్ర ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ దసరా శుభాకాంక్షలు
- ప్రజలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించిన జగన్
- దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అన్న జగన్
- దుర్గామాత ఆశీస్సులు.. దీవెనలు ప్రజలపై ఉండాలన్న జగన్
ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ దుర్గామాత ఆశీస్సులు... దీవెనలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.