పవన్ కల్యాణ్ ప్యాకేజీ గురించి కొన్నిరోజుల్లో వాస్తవాలు బయటకొస్తాయి: ద్వారంపూడి
- పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు
- వైసీపీని తిట్టేందుకు, జైలుకెళ్లి పరామర్శించేందుకు కూడా డబ్బులు తీసుకున్నారని ఆరోపణ
- టీడీపీతో పొత్తు పెట్టుకున్నందున జనసేన ప్రభావం ఉండదని వ్యాఖ్య
హవాలా ద్వారా ఎంత డబ్బు దేశం దాటి వెళ్లింది? పవన్ ప్యాకేజీ సొమ్ము రష్యాకు వెళ్ళిందా? సింగపూర్, దుబాయ్‌లకు వెళ్లిందా? అనే విషయాలు వెలుగు చూస్తాయన్నారు. రాజకీయంగా పవన్‌ను ఓ జోకర్లా చూస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా వంగవీటి రంగా ప్రభావం ఉన్న జిల్లా అని, అలాంటప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ప్రభావం ఇక్కడ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. జనసేనకు టీడీపీ వాళ్లే శత్రువులని, అలాగే టీడీపీకి జనసేనే శత్రువు అన్నారు. పైన లీడర్లు కలిసినంత ఈజీగా కింద క్యాడర్ కలవదన్నారు. దోచుకున్న డబ్బుతో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలనుకుంటున్నారని విమర్శించారు.