వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న సూర్య మూవీ!
- సూర్య తాజా చిత్రంగా రూపొందుతున్న 'కంగువ'
- కథానాయికగా సందడి చేయనున్న దిశా పటాని
- ఆ తరువాత సుధా కొంగరతో సెట్స్ పైకి వెళ్లనున్న సూర్య
- యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినిమా
ఆ సినిమా తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇది రతన్ టాటా బయోపిక్ అనే ప్రచారం జరిగింది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదనేది తేలిపోయింది. అయితే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా రూపొందనున్నట్టుగా తెలుస్తోంది.
క్రైమ్ ఎలిమెంట్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ప్రస్తుతం సూర్య 'కంగువ' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. దిశా పటాని కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, జ్ఞానవేల్ రాజాతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన సుధా కొంగర ప్రాజెక్టుపైకి వెళ్లనున్నాడని అంటున్నారు.