వివేకా హత్య కేసు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు
- బుధవారంతో ముగిసిన రిమాండ్ గడువు
- నాంపల్లి సీబీఐ కోర్టులో ఉదయ్ ని హాజరుపరిచిన అధికారులు
- మరో 14 రోజులు రిమాండ్ లోనే ఉదయ్ కుమార్
వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షాలను తారుమారు చేశారనే అభియోగాలతో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం నిందితుడిని నాంపల్లి సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. తాజాగా రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగించింది.