వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డి
- వివేకా హత్య కేసులో అవినాశ్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ
- రేపు మరోసారి విచారణ
- న్యాయవాదిని అనుమతించాలంటూ అవినాశ్ పిటిషన్
- ఆడియో, వీడియో రికార్డింగ్ కు ఆదేశించాలని విజ్ఞప్తి
- సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వినతి
అయితే, ఈ విషయంలో అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని... విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాదు, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇచ్చేలా ఆదేశించాలని కూడా తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.