గోపీచంద్ ‘రామబాణం’ నుంచి మొదటి బాణం అదిరింది
- శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణంలో నటిస్తున్న గోపీచంద్
- హీరోయిన్ గా డింపుల్ హయతి
- ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసిన చిత్ర బృందం
విక్కీ మొదటి బాణం పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో గోపీచంద్ తన మార్కు యాక్షన్ సీన్స్‌లో కనిపించారు. ఆయన కెరీర్లో ఇది 30వ చిత్రం కావడం విశేషం. దాంతో, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. యాక్షన్ తో పాటు లక్ష్యం, లౌక్యం మాదిరి సున్నితమైన కామెడీ కూడా ఉండేలా చూస్తున్నారు దర్శకుడు శ్రీవాస్. ఈ సినిమాకు భూపతి రాజా కథను అందించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు.