కేటీఆర్ చెప్పారు.. హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని నేనే: పాడి కౌశిక్‌రెడ్డి
- గవర్నర్ ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తున్నారన్న కౌశిక్‌రెడ్డి
- శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును ఆపడం ఏంటని ఆగ్రహం
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి ఈటలను ఆహ్వానిస్తామన్న బీఆర్ఎస్ నేత
శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును ఆపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆమె చర్యలపై అసంతృప్తితోనే గవర్నర్‌పై విమర్శలు చేసినట్టు చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతలు మాట్లాడే భాషపై ఆ పార్టీ సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని త్వరలోనే మంత్రి ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గౌరవంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.