మరో హారర్ థ్రిల్లర్ గా 'శబ్దం' .. టైటిల్ పోస్టర్ రిలీజ్!
- గతంలో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన 'వైశాలి'
- తెలుగు .. తమిళ భాషల్లో ఆ సినిమా హిట్
- అదే కాంబినేషన్ లో రూపొందుతున్న 'శబ్దం'
- ఇది కూడా హారర్ థ్రిల్లర్ నేపథ్యమే
- ఆసక్తిని రేకెత్తిస్తున్న టైటిల్ పోస్టర్
ఆది పినిశెట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, తెలుగు - తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. తెలుగులో 'శబ్దం' అనే టైటిల్ ను ఖరారు చేసి, కొంతసేపటి క్రితం టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చెవి .. గబ్బిలాల నేపథ్యంలో డిజైన్ చేసిన టైటిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గతంలో అరివళగన్ - ఆది పినిశెట్టి కాంబినేషన్ లో 'వైశాలి' అనే హారర్ థ్రిల్లర్ వచ్చింది. నీటిని ప్రేతాత్మ ఆవహించి ప్రతీకారం తీర్చుకోవడమనే కాన్సెప్టుతో వచ్చిన ఆ సినిమా, తమిళ .. తెలుగు భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకి కూడా తమన్ పనిచేశాడు. ఇప్పుడు అదే కాంబినేషన్లో 'శబ్దం' రానుందన్నమాట
.