'హిట్ 2' రిలీజ్ డేట్ ఖరారు!
- విష్వక్సేన్ హీరోగా వచ్చిన 'హిట్'
- ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'హిట్ 2'
- ఈ సినిమాకి కథానాయకుడిగా అడివి శేష్
- డిసెంబర్ 23వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాలో హీరోగా అడివి శేష్ నటించాడు. ఆయన సరసన నాయికగా మీనాక్షి చౌదరి అలరించనుంది. తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏదో కేస్ ఇన్వెస్టిగేషన్ గురించి సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్టుగా ఈ పోస్టర్లో అడివి శేష్ కనిపిస్తున్నాడు.
'హిట్' మొదటి భాగాన్ని అందించిన శైలేష్ కొలను, ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుందని ఆయన చెబుతున్నాడు. 'మేజర్' తరువాత అడివి శేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి ఉంది.
.