యువ హీరోలపై బండ్ల గణేశ్ విమర్శలు
- ఓ ఈవెంట్ లో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ
- పవన్ ను చూసి నేర్చుకోవాలన్న బండ్ల గణేశ్
- వినయంగా కూర్చున్న పవన్ ఫొటోను షేర్ చేసిన వైనం
తాజాగా యువ హీరోలను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్ లో అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. వీరి తీరుపై బండ్ల గణేశ్ విమర్శలు గుప్పించారు. 'నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర. దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం' అని ట్వీట్ చేశారు. దీనికి తోడు చేతులు కట్టుకుని వినయంగా కూర్చున్న పవన్ కల్యాణ్ ఫొటోను షేర్ చేశారు.