ప్రభాస్ .. చరణ్ లను రంగంలోకి దింపుతున్న శర్వా!
- శర్వానంద్ తాజా చిత్రంగా 'ఒకే ఒక జీవితం'
- టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ
- తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన సినిమా
- ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల
ప్రభాస్ - చరణ్ లతో శర్వానంద్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఆ ఇద్దరి కోసం స్పెషల్ షో వేయడానికి శర్వా సిద్ధం చేస్తున్నాడట. ఆ సినిమా చూసి ప్రభాస్ .. చరణ్ స్పందించే తీరు ఈ సినిమాపై అంచనాలు పెంచుతుందని ఆయన భావిస్తున్నాడు. ఇద్దరిలో ఒకరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని టాక్.
ఇది కేవలం తల్లీ కొడుకుల ఎమోషన్స్ కి సంబంధించిన కంటెంట్ మాత్రమే కాదు, ఆ ఎమోషన్ అనేది టైమ్ ట్రావెల్ తో ముడిపడి నడుస్తుంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అమల అక్కినేని .. నాజర్ .. వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.