'స్వాతిముత్యం' నుంచి సాంగ్ రిలీజ్!
- విభిన్న కథా చిత్రంగా 'స్వాతిముత్యం'
- హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయం
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- ఆగస్టు 13వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "మిల మిలా మెరుపులా మరి మరీ మెరిసినా .. మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లో కెగిరెనా" అంటూ ఈ పాట సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ - సంజనా ఆలపించారు.
హీరో హీరోయిన్లు లవ్ లో పడటం .. ఒకరిని గురించిన ఆలోచనలతో మరొకరు సతమతం కావడం .. అందమైన ఊహలలో తేలిపోవడం వంటి విజువల్స్ పై ఈ పాట సాగింది. సాహిత్యం ఓ మాదిరిగా అనిపించినా బీట్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.