ఏంటో .. ఏంటేంటో .. : 'థ్యాంక్యూ' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- విక్రమ్ కుమార్ నుంచి మరో విభిన్న చిత్రం
- ప్రేమ ప్రధానంగా సాగే కథ
- చైతూ సరసన ముగ్గురు నాయికలు
- జులై 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఆయన తాజా చిత్రంగా 'థ్యాంక్యూ' రూపొందింది. నాగచైతన్య కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ సరసన నాయికలుగా రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ కనిపించనున్నారు.
తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "ఏంటో ఏంటేంటో .. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో' అంటూ ఈ పాట సాగుతోంది. చైతూ .. మాళవిక నాయర్ పై చిత్రీకరించిన పాట ఇది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, జొనిత గాంధీ ఆలపించారు. ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.