పవన్ కల్యాణ్ పై అభిప్రాయం చెప్పేంత స్థాయి నాకు లేదు: అనుపమ పరమేశ్వరన్
- బటర్ ఫ్లై చిత్రంలో నటించిన అనుపమ
- త్వరలో విడుదల కానున్న సినిమా
- ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుపమ
- పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని వెల్లడి
ఆమెను పవన్ కల్యాణ్ గురించి అడగ్గా ఆసక్తికర సంగతులు పంచుకుంది. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రాన్ని బురఖా వేసుకుని వెళ్లి చూశానని వెల్లడించింది. బటర్ ఫ్లై చిత్రం హీరో నిహాల్ తో కలిసి భీమ్లా నాయక్ విడుదలైన రోజే తొలి ఆట చూశానని పేర్కొంది. హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్ కు వెళ్లామని, తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బురఖా వేసుకున్నానని అనుపమ వివరించింది. అయితే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై అభిప్రాయం వెల్లడించేంత స్థాయి తనకు లేదని అనుపమ స్పష్టం చేసింది. పవన్ పెద్ద హీరో అని, ఆయనను తాను అభిమానిస్తానని వెల్లడించింది.