నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయ్: అనిల్ రావిపూడి
- 'ఎఫ్ 3' సెలబ్రేషన్స్ లో అనిల్ రావిపూడి
- కంటెంట్ ఉంటే కాదనరంటూ కితాబు
- సినిమాను ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పిన దర్శకుడు
- వసూళ్లు పెరుగుతున్నందుకు హ్యాపీగా ఉందంటూ వ్యాఖ్య
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీకి ఏడాదికి పది హిట్లు కూడా వస్తాయో రావో తెలియడం లేదు. అలాంటి ఈ పరిస్థితుల్లో నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నింటినో దాటుకుని ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావలసి వస్తోంది. కంటెంట్ బాగుంటే చాలు .. మీరంతా నెత్తుమీద పెట్టుకుని ఆదరిస్తున్నారు.
ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి వసూళ్లు .. ప్రశంసలు పెరుగుతున్నాయి. ఈ వారమంతా కూడా ఈ సినిమా బాగా ఆడాలని .. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కోవిడ్ తరువాత వచ్చిన 'అఖండ' .. 'పుష్ప' .. 'భీమ్లా నాయక్' .. 'ఆర్ ఆర్ ఆర్' ఇలా అన్ని సినిమాలు ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకురావడానికే ప్రయత్నించాయి. ఆ సినిమాల సరసన 'ఎఫ్ 3' నిలవడం ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.