పవన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్!
- ' గబ్బర్ సింగ్' కాంబినేషన్లో మరో సినిమా
- 'భవదీయుడు భగత్ సింగ్' గా టైటిల్ ఫిక్స్
- ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్న పవన్
- కథానాయికగా కనిపించనున్న పూజ హెగ్డే
- త్వరలోనే మొదలు కానున్న షూటింగు
ఈ సినిమా తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పవన్ ఎలా కనిపించనున్నారు? ఆయనను ఎలా చూపించనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఆయన ప్రొఫెసర్ గా కనిపించనున్నారని హరీశ్ శంకర్ చెప్పాడు.
పవన్ ఈ సినిమాలో ప్రొఫెసర్ గా కనిపించనున్నాడనే టాక్ ఇంతకుముందే వచ్చింది. ఇప్పుడు ఆ విషయంలో హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చాడన్న మాట. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ జోడీని తెరపై చూడటం కోసం .. ' గబ్బర్ సింగ్' కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు.